విడిపోయిన భార్యకు భరణం ఇవ్వాల్సిందే !

Telugu Lo Computer
0


ర్తకు ఉద్యోగం ద్వారా ఆదాయం లేకపోయినప్పటికీ, తన భార్యకు భరణం ఇవ్వాల్సిన బాధ్యత ఆ భర్తకు ఉందని అలహాబాద్‌ హైకోర్టు తెలిపింది. మాజీ భార్యకు నెలకు 2 వేల రూపాయిలు చొప్పున భరణాన్ని చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ రేణు అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యకు మంజూరైన భరణం మొత్తాన్ని భర్త నుంచి రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించింది. తన భార్య టీచింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు రుజువు చేసే డాక్యుమెంటేషన్‌ను అందించడంలో భర్త విఫలమయ్యాడని అలహాబాద్​ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికితోడు తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ల బాధ్యతలతో ఆర్థిక భారం పడుతోందనే భర్త వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని, కష్టపడి డబ్బు సంపాదించే సామర్థ్యం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఉద్యోగ నైపుణ్యాలు లేకపోయినా కార్మికుడిగా వెళ్తే రోజుకు రూ.300 నుంచి 400 వరకు సంపాదించవచ్చని.. ఆ డబ్బుతో భార్యకు డబ్బులు చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)