చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్‌ !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో జాక్ క్రాలే ను ఔట్ చేయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడి జాబితాలో అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ 169 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఉప్పల్ మ్యాచ్‌కు ముందు అశ్విన్ ఖాతాలో 148 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ (35)ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ 149 వికెట్‌ను కైవసం చేసుకున్నాడు. 16వ ఓవర్‌లోని మొదటి బంతికి మహ్మద్ సిరాజ్ క్యాచ్ అందుకోవడంతో జాక్ క్రాలే (20) పెవిలియన్‌కు చేరుకోవడంతో అశ్విన్ ఖాతాలో 150వ వికెట్ వచ్చి చేరింది. 31 డబ్ల్యూటీసీ టెస్టు మ్యాచుల్లో అశ్విన్ ఈ మైలు రాయిని చేరుకున్నాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 ఆటగాళ్లు.. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) - 40 టెస్టుల్లో 169 వికెట్లు, నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) - 41 టెస్టుల్లో 169 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ (భారత్‌) - 31 టెస్టుల్లో 150 వికెట్లు, మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) - 36 టెస్టుల్లో 140 వికెట్లు, స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్‌) - 33 టెస్టుల్లో 134 వికెట్లు. 


Post a Comment

0Comments

Post a Comment (0)