బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల ఆదివారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు ఆమెకు పిసిసి పగ్గాలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కె వి పి రామచంద్రరావు, రఘవీరారెడ్డి, సుంకర పద్మశ్రీ, ఎమ్మెల్యే ఆర్కే తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార అనంతరం షర్మిల మాట్లాడుతూ, తన తండ్రి అధిష్టించిన పీఠంపై తాను కూర్చోవడం తనపై మరింత బాద్యతను పెంచిందన్నారు. కాంగ్రెస్ కు తిరుగులేని నేతగా ఉన్న వైఎస్ బిడ్డగా తాను కూడా కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని చెప్పారు.  చెల్లాచెదురైన కాంగ్రెస్ నేతలను, కాంగ్రెస్ నేతలను ఏకంగా చేయడం తన ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికలు సమయం తక్కువుగా ఉండటంతో అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపు ఇచ్చారు. తాను పదవీ బాద్యతలు స్వీకరించకుండా తన కాన్వాయ్ అడ్డుకున్న వైసిపి ప్రభుత్వానికి అప్పడే భయం మొదలైందన్నారు. ముందు ముందు అసలు సినిమాను అధికార పార్టీకి చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సుశిక్షత సైనికురాలిలా పని చేయడానికి షర్మిల వచ్చారని పేర్కొన్నారు. రాజన్న బిడ్డ రావాలని, ఆమె నేతృత్వంలో పని చేయాలని కోరుకున్నామని, అనుకున్నట్లుగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందని అన్నారు. ఇక, ఈసారి చట్ట సభల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. ఏపిలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించే దిశగా . ఇప్పటికే, కేవీపీ రామచంద్రరావుపై పార్టీ హైకమాండ్ గురుతర బాధ్యత పెట్టింది అనే విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ సీనియర్ నేతలంతా గైడింగ్ ఫోర్సుగా ఉండి.. వైఎస్ షర్మిలకు సహకరిస్తారని చెప్పారు. ఏపి రాజకీయాలలో ఇప్పడు రాహుల్ గాంధీ వదిలిన బాణం షర్మిల అని గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)