వన్ నేషన్-వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్నాం !

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ''వన్ నేషన్-వన్ ఎలక్షన్'ని వ్యతిరేకించారు. దీనిపై ప్యానెల్ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు. ఏక కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను తాము ఒప్పుకోమని చెప్పారు. జమిలి ఎన్నికలకు '' అధ్యక్ష పరిపాలనకు ఒక అడుగు'' అని పేర్కొంది. ఈ తరహా విధానం భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమన్నారు. ఇది ప్రజాస్వామ్య ముసుగులో నియంత్రుత్వానికి దారి తీస్తుందని, తాము నియంతృత్వానికి వ్యతిరేకమని, అందుకే తాము జమిలి ఎన్నికలకు దూరమని మమతా రామ్‌నాథ్ కోవింద్ ప్యానెల్‌కి లేఖ రాశారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ స్పష్టంగా లేదని దీనితో మేం విభేదిస్తున్నామని దీదీ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాల వల్ల తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయకపోవచ్చు, గత 50 ఏళ్లలో లోక్‌సభ అనేక సార్లు ముందస్తుగా రద్దైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించడమే మార్గం, కేవలం ఏకకాలంలో ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్రాలపై ఒత్తిడి తేవద్దు, ఇలా చేస్తే 5 ఏళ్ల పాలనపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారని లేఖలో మమతా బెనర్జీ పేర్కొంది. భారత రాజ్యాంగం కూడా వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని అనుసరించడం లేదని అన్నారు. కేంద్రం వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల సూచనలు చేయాలని ప్రజల్ని, పార్టీలను కోరింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)