కల్యాణ మండపంలో వరుడు తుపాకీతో రచ్చ..రచ్చ.... !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా న్యూ మండి కొత్వాలి ప్రాంతంలోని జనసత్ రోడ్‌లో ఉన్న ఓ బాంక్వెట్ హాల్‌లో వరుడు తన బంధువులతో కలిసి తుపాకీతో పెళ్లి మండంపై డ్యాన్స్ చేశాడు. ఈ సమయంలో వధువు చేతిలో తుపాకీ పెట్టి కాల్పించే ప్రయత్నం చేశాడు. అయితే అది పేలలేదు. దీంతో వరుడు తుపాకీని తీసుకుని గాల్లోకి గురి పెట్టి కాల్చాడు. ఈ సారి అది పేలింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై సీవో రూపాలీరావు మాట్లాడుతూ మండి ప్రాంతంలో పెళ్లి సందర్భంగా వరుడు తుపాకీతో డ్యాన్స్ చేశాడని తెలిపారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)