పోలీస్‌ నుంచి గన్‌ లాక్కొని కాల్చుకునేందుకు యత్నంచిన నిందితుడు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హత్య చేసేందుకు తనపై దాడి చేశారంటూ మనీష్ ప్రజాపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రషీద్, డానిష్, ఇతరులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, డానిష్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, శనివారం మధ్యాహ్నం రషీద్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఒక పోలీస్‌ వద్ద ఉన్న గన్‌ను అతడు లాక్కున్నాడు. తొలుత పోలీస్‌ను బెదిరించాడు. తర్వాత తన సహచరుడ్ని విడిపించాలని డిమాండ్‌ చేశాడు. ఆ తర్వాత గన్‌ను తన తలకు గురిపెట్టుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్లకు చెందిన పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్థానికులు కూడా అక్కడ గుమిగూడారు. దీంతో ఏం జరుగుతోందో అన్న ఉత్కంఠ నెలకొన్నది. తొలుత పోలీసులు రషీద్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు అతడి నుంచి గన్‌ లాక్కున్నారు. రషీద్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)