కోతిని కాల్చి చంపి పాతిపెట్టారు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జనవరి 16న నౌబస్తాలో ఓ కోతిని కాల్చి చంపి పాతిపెట్టారు. తమ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఎయిర్ గన్ తో కోతిని కాల్చి చంపి పాతిపెట్టారని స్థానికుడు జనవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పూడ్చిపెట్టిన కోతిని వెలికితీశారు. కోతిని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. జనవరి 16న సురేందర్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి కోతిని హత్య చేశాడని.. స్థానికులు మృతదేహాన్ని పాతిపెట్టారని నౌబస్తాలోని సనాతన్ మఠ్ మందిర్ అధికారి ద్వివేది చెప్పారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని.. కోతిని చంపిన స్థలంలో భారీ ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ అశుతోష్ చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)