జపాన్‌లో భారీ భూకంపం !

Telugu Lo Computer
0


పాన్‌ లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైనట్లు జపాన్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ భూప్రకంపనల ధాటికి జపాన్‌ రాధాని టోక్యో, కాంటో ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. అయితే, ఈ భూప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో జపాన్‌ ప్రభుత్వం సునామీహెచ్చరికలు జారీ చేసింది. 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని.. ముందు జాగ్రత్తగా ప్రజలు వెంటనే తీర ప్రాంతాలను వదిలి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలకు బిల్డింగులు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను జపాన్‌ వాసులు తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)