ప్రజాదరణ పొందుతున్న 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ !

Telugu Lo Computer
0


సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ఊహించిన దాని కంటే పదింతలు ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. మెల్లమెల్లగా దీని అందరూ చూస్తూ సోషల్ మీడియాలో ప్రశంసించడం మొదలు పెట్టారు. దాంతో ఈ వెబ్ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఇది ప్రత్యేకంగా రాసిన కథ కాదు.. మన కథ.. మన ఇంటి కథ. 90ల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ లెవెల్‌లో కనెక్ట్ అవుతుంది. అక్కడ జరిగే ప్రతి సన్నివేశంలో తమను తాను చూసుకుంటారు. ఒంటెద్దులా ఇంటి బాధ్యత మోసే నాన్న.. ఇంట్లో భారం మోస్తూ కల్మషం లేని ప్రేమ చూపించే అమ్మ.. చాలీచాలని జీతాలు.. మధ్య తరగతి కష్టాలు.. పొద్దున్నే ఉప్మాతో పడే పాట్లు.. తమ్ముడితో చిలిపి తగాదాలు, వాళ్ల ప్రేమలు,  స్కూళ్లలో మార్కుల కోసం యుద్దాలు, వీకెండ్‌లో ఆడే బెట్ మ్యాచులు, ఇంట్లో చెప్పకుండా వెళ్లే పార్టీలు, మార్కులు తక్కువగా వచ్చినప్పుడు నాన్నతో తిన్న తన్నులు, స్కూల్లో మన మొదటి ప్రేమ  ఇలా ఒక్కటేంటి ప్రతి ఒక్కటి వెబ్ సిరీస్‌లో కనెక్ట్ అవుతాయి. వీటన్నింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్. ఎక్కడ ఏ చిన్న డీటెయిల్ కూడా మిస్ చేయలేదు. దాంతో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ఈ సిరీస్. మధ్య తరగతి స్కూల్ టీచర్ పాత్రలో శివాజీ పూర్తి న్యాయం చేశాడు.. భార్యగా, అమ్మగా వాసుకి అద్భుతంగా నటించారు.. మౌళి, రోహన్, వాసంతిక నటన బాగుంది. ముఖ్యంగా రోహన్ నటన అయితే నెక్స్ట్ లెవెల్. సోషల్ మీడియాలో మనోడి క్లిప్పింగ్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. దానికి చూడు రోహన్ పై వచ్చే సాంప్రదాయని సుబ్బిని అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ బాగా వైరల్ అవుతుంది. ఆదిత్య హాసన్ డైరెక్షన్ ఆకట్టుకుంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)