69వ ఫిలింఫేర్‌లో ఉత్తమ నటుడుగా రణ్‌బీర్‌ కపూర్‌ !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక 69వ ఫిలింఫేర్‌ అవార్డ్స్ లను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలనే ఈ అవార్డులకు ఎంపిక చేశారు. విక్రాంత్ మాస్సే-విధు వినోద్ చోప్రా చిత్రం 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే! బాలీవుడ్‌ స్టార్‌ జంట రణబీర్ కపూర్- అలియా భట్ ఉత్తమ హీరో, హీరోయిన్‌ అవార్డును ఎగరేసుకుపోయారు. యానిమల్‌ చిత్రానికిగానూ రణబీర్‌ కపూర్‌ ఎంపికైతే.. రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ చిత్రానికి గాను అలియాభట్‌ ఎంపికైంది. 12th ఫెయిల్ చిత్రాన్ని తెరకెక్కించిన విధు వినోద్‌ చోప్రాకు ఉత్తమ డైరెక్టర్‌గా అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌, ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌), ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌), ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ), ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌), ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌), ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ), ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ), ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(జరా హత్కే జరా బచ్కే), ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: (యానిమల్‌ ), ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌), ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌), ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2), ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌), ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ), ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: హర్షవర్ధన్‌రామేశ్వర్‌ (యానిమల్‌), ఉత్తమ సినిమాటోగ్రఫీ : అవినాష్ అరుణ్ ధావారే (త్రీ ఆఫ్‌ అజ్‌), ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : సచిన్ లవ్లేకర్, దివ్వ్యా గంభీర్, నిధి గంభీర్ (స్యామ్‌ బహదూర్), ఉత్తమ కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య ( వాట్‌ జుమ్కా?- రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ). 

Post a Comment

0Comments

Post a Comment (0)