అయోధ్య ఆలయానికి 400 కేజీల భారీ తాళం బహుకరణ !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 22వ తేదీన మధ్యాహ్నం రామ మందిరం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాణ ప్రతిష్ఠ కోసం సిద్ధమౌతున్న అయోధ్య ఆలయానికి దేశ, విదేశాల నుంచి అనేక బహుమతులు అందుతున్నాయి. సీతాదేవి జన్మించిన జనక్‌పురి నుంచి నేపాల్ ప్రభుత్వం వెండి విల్లంబులను పంపించింది. తమ దేశ ప్రత్యేకతగా చెప్పుకొనే కొన్ని రకాల స్వీట్లను కానుకగా అందజేసింది. గుజరాత్‌కు చెందిన కొందరు వ్యాపారస్తులు 108 అడుగుల అగరబత్తీని అయోధ్యకు పంపించారు. 21 రోజుల పాటు ఏకధాటిగా మండుతుంది ఈ అగరబత్తీ. ఈ నెల 16వ తేదీన దీన్ని వెలిగించారు అయోధ్యవాసులు. 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకూ వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏకంగా లక్ష లడ్డూ ప్రసాదాలను అందజేయనుంది. ఈ లడ్డూలన్నింటినీ ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలించారు టీటీడీ అధికారులు. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు. ప్రతి ఒక్కరికీ రెండు లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిస్తుంది. మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు. తాజాగా హిందూ మహాసభ అయోధ్యా ఆలయానికి భారీ తాళాన్ని బహుమతిగా పంపించింది. దీని బరువు 400 కేజీలు. దీన్ని లారీలోకి ఎక్కించడానికి రెండు భారీ క్రేన్లను వినియోగించాల్సి వచ్చింది. ఈ ఉదయం తాళం- తాళం చెవిఈ ఉదయం అయోధ్యకు చేరాయి. హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతి దీన్ని తయారు చేయించారు. అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాష్ శర్మ, రుక్మణి శర్మ దీన్ని తయారు చేశారు. సత్యప్రకాష్ శర్మ ఇటీవలే మరణించారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ తాళాన్ని పంపించాలనేది ఆయన చివరి కోరిక. ఆయన కోరికను నెరవేర్చడానికి హిందూ మహాసభ ముందుకొచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)