వెన్న కరిగించి నెయ్యి చేయడం ఎలాకు 3 కోట్ల వ్యూస్ ?

Telugu Lo Computer
0


వెన్న కరిగించి నెయ్యి చేయడం ఎలా?.. ఈ ప్రశ్నలోనే సమాధానం దాగుంది. వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుందని, అలాంటిది ఓ మహిళ.. కుక్కర్‌లో వెన్న కరిగించి నెయ్యి చేయండిలా! అని వీడియో పెట్టగానే జనాలు ఎగబడి మరీ చూసేస్తున్నారు. ఈ వీడియోకు లక్షల్లో లైకులు, కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ జనాలు నిజంగానే తెలియక చూస్తున్నారా..! లేదా ఇలాంటి వీడియోలు మనం కూడా చేస్తే ఎవరైనా చూస్తారా..! అనే కుతూహలంతో చూస్తున్నారా..అనేది అంతుపట్టడం లేదు. షిప్రా కేసర్వాణి అనే ఒక ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్.. 'కుక్కర్‌లో నెయ్యి ఎలా తయారు చేయాలి..' అనే క్యాప్షన్‌తో ఒక రెసిపీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మొదట ఆమె వెన్నను ప్రెషర్ కుక్కర్‌లో వేసి దానికి కొన్ని నీటిని కలిపి మూత పెట్టింది. అనంతరం దాన్ని స్టవ్ పై ఉంచి ఒక విజిల్స్ వచ్చాక మూత తెరిచి, బేకింగ్ సోడా వేసి మిశ్రమాన్ని యాడ్ చేసింది. ఆపై మరికొన్ని నిమిషాల పాటు దాన్ని స్టవ్ పై మరిగించి నెయ్యి తయారుచేసింది. చివరలో మిశ్రమాన్ని ఒక కంటైనర్‌లోకి వడబోసింది. ఈ రెసిపీని కేసర్వాణి సోషల్ మీడియాలో పంచుకోగా.. మంచి స్పందన వస్తోంది. 'నైస్ ట్రిక్', 'బాగా చెప్పారు' అనేవారు కొందరైతే, జనాలను వెర్రి పుష్పాలను చేయడం కాకపోతే ఇదొక వీడియోనా..! అని విమర్శించేవారు.. మరికొందరు. మొత్తానికి ఈ రెసిపీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)