30న 'కొడనాడు' కేసు విచారణ

Telugu Lo Computer
0


మిళనాడులో కొడనాడు హత్య, దోపిడీ కేసుకు సంబంధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఈ నెల 30,31 తేదీల్లో మాస్టర్‌ న్యాయస్థానంలో హాజరై సాక్ష్యం ఇస్తారని ఆయన తరఫు న్యాయవాదులు మద్రాసు హైకోర్టుకు తెలిపారు. కొడనాడు కేసులో తనకు సంబంధాలున్నాయంటూ పేర్కొన్న ఢిల్లీకి చెందిన పాత్రికేయుడు మేథ్యూ సామువేలు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సయాన్‌, వాలైయార్‌ మనోజ్‌ తదితరులకు వ్యతిరేకంగా 2019లో పళనిస్వామి, రూ.1.10 కోట్ల పరువు నష్టం కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ కేసులో సాక్ష్యాలు నమోదు చేయాలని పేర్కొంటూ కేసు మాస్టర్‌ న్యాయస్థానానికి పంపుతూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ఆ కేసులో కోర్టుకు స్వయంగా హాజరైన సాక్ష్యమిచ్చేందుకు ఈపీఎస్‌కు మినహాయింపు కల్పించిన న్వాయస్థానం, ఆయన ఇంటి వద్దకు వెళ్లి సాక్ష్యం నమోదు చేసేలా న్యాయవాది ఎస్‌.కార్తీకైబాలన్‌ను నియమించింది. ఈ ఉత్తర్వులు వ్యతిరేకిస్తూ మాథ్యూ సామువేలు అప్పీలు పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ విచారించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం, ఈ నెల 30, 31 తేదీల్లో మద్రాసు హైకోర్టు ప్రాంగణంలో ఉన్న మాస్టర్‌ న్యాయస్థానానికి పళనిస్వామి హాజరై సాక్ష్యమివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఈపీఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం న్యాయమూర్తి ఎన్‌.సతీ్‌షకుమార్‌ విచారించగా, ఈపీఎస్‌ తరఫున హాజరైన న్యాయవాది, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 30, 31 తేదీల్లో పళనిస్వామి మాస్టర్‌ న్యాయస్థానం ఎదుట హాజరైన సాక్ష్యమిస్తారని తెలిపారు. అనంతరం కేసు విచారణ ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)