29వ అంతస్తుపై నుంచి పడి స్కైడైవర్‌ దుర్మరణం !

Telugu Lo Computer
0


బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌షైర్‌కు చెందిన నాథీ ఒడిన్సన్‌ (33) స్కైడైవింగ్ చేసేందుకు శనివారం థాయ్‌లాండ్ లోని పట్టాయాలోని ఓ రిసార్టుకు వచ్చాడు. తన స్టంట్‌ కోసం ముందస్తు అనుమతి తీసుకోలేదు. కింద నుండి అతడి స్నేహితుడు వీడియో తీస్తుండగా, ఓ భవనం 29వ అంతస్తు నుంచి దూకాడు. కానీ సమయానికి పారాచూట్‌ తెరుచుకోలేదు. దాంతో అతడు వేగంగా ఓ చెట్టును తాకి నేలపై పడిఅక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ... 'పారాచూట్‌ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనను వీడియో రికార్డు చేసిన అతడి స్నేహితుడిని విచారిస్తున్నాం. వీడియోను ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం' అని తెలిపారు. మృతుడికి స్కైడైవింగ్‌లో, పారాచూట్‌ వినియోగంలో అనుభవం ఉంది. అతడి సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించి పలు చిత్రాలు, వీడియోలు ఉన్నాయి. నాథీకి స్కై ఫొటోగ్రఫీ సంస్థ కూడా ఉంది. ఈ ఘటనపై థాయ్‌లాండ్ పోలీసులు వెంటనే బ్రిటిష్‌ ఎంబసీకి సమాచారం అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)