250 కోట్ల దాటిన హనుమాన్ కలెక్షన్స్ !

Telugu Lo Computer
0


నుమాన్‌ మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మరో అరుదైన ఫీట్‌ను అందుకుంది హనుమాన్‌. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈమూవీ తాజాగా 250 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. గణతంత్ర దినోత్సవం కావడంతో జనవరి 26 హనుమాన్‌ వసూళ్లు మరింత పెరిగాయి. అందుకే కేవలం 15 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లు దాటేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా 250 కోట్ల పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇప్పట్లో రవితేజ ఈగల్‌ తప్ప మరే పెద్ద లు రిలీజ్‌ కావడం లేదు. సో.. రాబోయే రోజుల్లో హనుమాన్‌ రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)