టీ20 వరల్డ్‌కప్‌ 2024 షెడ్యూల్‌ విడుదల !

Telugu Lo Computer
0


2024 టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికలుగా జరిగే ఈ మెగా టోర్నీ జూన్‌ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లు విభజించబడి పోటీపడతాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, పాక్‌లతో పాటు ఐర్లాండ్‌, కెనడా, యూఎస్‌ఏ జట్లు ఉండగా, గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో పాటు నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌ జట్లు. గ్రూప్‌-సిలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, ఉగాండ, పపువా న్యూ గినియా. గ్రూప్‌-డిలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు జూన్‌ 1 నుంచి 18 వరకు జరుగనుండగా సూపర్‌ 8 దశ మ్యాచ్‌లు జూన్‌ 19 నుంచి 24 వరకు జరుగుతాయి. జూన్‌ 26, 27 తేదీల్లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లు (గయనా, ట్రినిడాడ్‌) జరుగనుండగా.. జూన్‌ 29న ఫైనల్‌ (బార్బడోస్‌) జరుగుతుంది. టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌.. జూన్‌ 1: యూఎస్‌ఏ వర్సెస్‌ కెనడా మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)