గ్రూప్‌ -1 పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించిన ఏపీపీఎస్సీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌- 1 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల గడువును పొడింగించారు. జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు తుది గడువును పొడిగిస్తూ ఏపీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు జనవరి 21తో ముగిసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ https://psc.ap.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న జరుగుతుందని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)