ఏప్రిల్ 16 నుంచే లోక్‌సభ ఎన్నికలు ?

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికలు సంబంధించిన ఓ సర్క్యూలర్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది. ఇందులో ఎన్నికల తేదీని ఏప్రిల్ 16గా పేర్కొన్నారు. ఈ లేఖ ఢిల్లీ సీఈవో కార్యాలయం నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాల ఎన్నికల అధికారులకు నోటిఫికేషన్ పంపించినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదలవుతాయా? అనే చర్చ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనిపై ఎక్స్ వేదికగా ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ క్లారిటీ ఇచ్చారు. ఈ తేదీలు కేవలం రిఫరెన్స్ కోసమేనని స్పష్టం చేసింది. ఈ సర్క్యూలర్ పై పలు మీడియా సంస్థలు ప్రశ్నలు వేసినట్లు తెలిపింది. ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ సంప్రదాయాన్ని ఈసీ పాటిస్తూ వస్తుందని కొన్ని వర్గాలు తెలిపాయి. ముందుగా ఒక రిఫరెన్స్ తేదీని పెట్టుకుని అందుకు అనుగుణంగా ముందస్తు కార్యకలాపాలను ఎన్నికల అధికారులు పూర్తి చేస్తారు. అయితే లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఏప్రిల్ లో మెుదలై మే లో ముగిసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 52 సీట్లకే పరిమితమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీసింది. అంతేకాకుండా అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికలతోపాటు ఏప్రిల్‍లోనే సార్వత్రిక ఎన్నికలు కూడా నిర్వహించాలని యోచిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)