మార్చి 15లోగా సైనికులను ఉపసంహరించుకోండి !

Telugu Lo Computer
0


మార్చి 15లోపు తమ దేశం నుంచి భారత్ తమ సైనికులను ఉపసంహరించుకోవాలని మాల్దీవ్స్ మరోసారి కోరింది. చైనాతో సంబంధాల కోసం మొగ్గు చూపుతూ భారత వ్యతిరేఖ వైఖరి అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ ప్రదర్శిస్తున్నాడు. చైనా పర్యటనకు వెళ్లొచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.  ముయిజ్జూ ఎన్నికల ప్రచారం కూడా 'ఇండియా అవుట్' నినాదంతో సాగింది. తమ దేశ సార్వభౌమాధికారం కోసం కట్టుబడి ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్న ప్రస్తుతం గవర్నమెంట్, చైనాతో అంటకాగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో భారత్ 'బాయ్‌కాట్ మాల్దీవ్స్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్ హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్ క్యాన్సల్ చేసుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)