భారతీయ అమెరికన్ల నివాసాలే లక్ష్యంగా చోరీలు

Telugu Lo Computer
0


మెరికాలో భారతీయ అమెరికన్ల నివాసాలే లక్ష్యంగా వ్యవస్థీకృత చోరీలు జరుగుతున్నాయి. వాషింగ్టన్‌లోని వివిధ ప్రాంతాల్లో రెండు వారాలుగా ఇలాంటి ఘటనలు పెరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. స్నోహౌమిష్‌ కౌంటీలోని బాథల్‌ ప్రాంతంలో పగటిపూటే చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరోవైపు, చోరీ జరిగిన ప్రాంతాల్లో దొంగలకు సంబంధించి ఏవైనా వీడియోలు లేదా ఫొటోలు సీసీటీవీల్లో రికార్డ్‌ అయి ఉంటే వాటిని అందజేయాల్సిందిగా రాబరీ అండ్‌ బర్గ్‌లరీ యూనిట్‌ స్థానికులకు విజ్ఞప్తి చేసింది. కాన్యన్‌ క్రీక్‌ ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అనుమానితుల ఫొటోలనూ స్థానిక పోలీసులు విడుదల చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)