రాజస్థాన్ కొత్త​ సీఎంగా భజన్​ లాల్ శర్మ !

Telugu Lo Computer
0


రాజస్థాన్ నూతన​ సీఎంగా భజన్​లాల్ శర్మను నియమిస్తూ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనను పార్టీ శాసనసభాపక్ష నేతగా జయపురలో జరిగిన భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం వసుంధర రాజేను కాదని పార్టీ అధిష్ఠానం భజన్​లాల్ వైపు మొగ్గు చూపింది. నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు జయపురలో సమావేశమయ్యారు. అధిష్ఠాన పరిశీలకులుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పార్టీ నేతలు సరోజ్‌ పాండే, వినోద్‌ తావ్డేలు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం భజన్​ లాల్​ పేరును మాజీ సీఎం వసుంధర రాజే ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపారు. నూతన ముఖ్యమంత్రికి పార్టీ అధిష్ఠానం శుభాకాంక్షలు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)