నానమ్మను పొగిడిన మనుమడు !

Telugu Lo Computer
0

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. 1971 భారత్‌-పాకిస్తాన్ యుద్ధంలో భారత విజయాన్ని ప్రస్తావిస్తూ నిజమైన నాయకులు గెలుపు వల్ల లభించిన పేరు ప్రతిష్టలను తన తన ఖాతాలోనే వేసుకోరని అన్నారు. ఈ మేరకు 1971 యుద్ధంలో భారత్‌ చారిత్రాత్మక విజయం తర్వాత అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సామ్‌ మానెక్‌షాకు ఇందిరా రాసిన లేఖను వరుణ్‌ గాంధీ షేర్ చేశారు. 'మొత్తం జట్టు కలిసికట్టుగా కృషి చేస్తేనే విజయం లభిస్తుందని నిజమైన నాయకుడికి తెలుసు. విజయంతో వచ్చిన కీర్తి ప్రతిష్టలను వారు ఒక్కరే స్వీకరించరు. ఎప్పుడూ ఎలా విశాల హృదయంతో ఉండాలో ఆ నేతకు తెలుసు' అని వరుణ్‌ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారి తీసిన విజయం గురించి గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు భారతదేశం మొత్తం ఈ ఇద్దర్ని జాతీయసంపదగా భావిస్తోందని, వారికి వందనం చేస్తుందని అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)