అసూయతోనే నందినిని హత్య చేశాను !

Telugu Lo Computer
0


టెక్కీ నందిని (26) వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందన్న అసూయతోనే ఆమె స్నేహితుడు వెట్రిమారన్‌ ఈ దారుణ హత్యకు పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నందిని, నిందితుడు వెట్రిమారన్‌ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఒకే స్కూల్‌లో చదివారు. చదువు అనంతరం ఇద్దరూ చెన్నై వచ్చి ఒకే కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అయితే నిందితుని పాత పేరు మహేశ్వరి. కేవలం నందినిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే కొన్ని నెలల క్రితం అతడు లింగ మార్పిడీ సర్జరీ చేయించుకుని వెట్రిమారన్‌గా మారాడు. ఇద్దరూ ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో నందిని కొంతకాలంగా వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని, ఈ విషయంలో తాను తట్టుకోలేకే ఆమెను హత్య చేసినట్లు వెట్రిమారన్‌ పోలీసులకు చెప్పాడు. నందినిని హతమార్చాలనే ఉద్దేశంతోనే ఈ నెల 23న రాత్రి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇస్తానని పిలిచి చైన్‌తో గొంతు నులిమి, బ్లేడ్‌తో కోసి నిప్పంటించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నందిని మరణించింది. ఈ కేసులో పోలీసులు వెట్రిమారన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)