భారీ నిమ్మకాయలు !

Telugu Lo Computer
0


ర్ణాటకలో కొడుగు జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం క్యూ కడుతుండటం విశేషం. ఇవి అరుదుగా ఐరోపా వంటి దేశాల్లోనే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఊరగాయాలు, శీతల పానీయాల తయారీకి ఉపయోగిస్తారని వెల్లడయ్యింది.విజు సుబ్రమణి నాలుగేళ్ల క్రితం మైసూర్‌ వెళ్లినప్పుడు అక్కడ ఒక మార్కెట్‌లో ఈ విత్తనాలను కొనుగోలు చేశానని తెలిపారు. ఆ తర్వాత వాటిని తన ఇంటి సమీపంలో ఉన్న గార్డెన్‌లో పెంచానని,  పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేసినట్లు చెప్పారు. మూడేళ్లకు ఈ నిమ్మ చెట్లు పెరిగి పెద్దవయ్యాయని తెలిపారు. అయితే ఆ చెట్లకు నిమ్మ పువ్వులు, కాయలు గానీ రాలేదు. దీంతో ఇది నిమ్మ చెట్టేనా..! అనే అనుమానం వచ్చింది. ఈలోగా కొద్దిరోజులకే పంట రావడం మొదలైంది. చూస్తుండగానే నిమ్మకాయలు భారీ పరిమాణంలో కాసాయని చెప్పారు. సాధారణంగా నిమ్మకాయ 60 గ్రాముల బరువు ఉండి, రెండు నుంచి మూడు అంగుళాల పొడవే ఉంటాయి. ఈ నిమ్మకాయ మాత్రం ఒక్కొక్కటి ఏకంగా 5 కిలోల బరువు ఉండి, ఆరడగులు వరకు పెరగడం విశేషం. 

Post a Comment

0Comments

Post a Comment (0)