ఇది అల మాత్రమే - సునామీ ముందుంది !

Telugu Lo Computer
0


నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఫలితాలపై బెంగాల్‌ భాజపా నేత సువేందు అధికారి స్పందించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం దిశగా భాజపా దూసుకెళ్లడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా సాధించిన ఫలితాల ప్రభావం పశ్చిమ బెంగాల్‌పైనా ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సునామీ కోసం బెంగాల్‌ ఎదురుచూస్తోందన్నారు. ఆదివారం ఆయన కోల్‌కతాలో విలేకర్లతో మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లోని బెంగాలీ వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో భాజపా గొప్ప ఫలితాలు సాధించడంలో బెంగాలీలు నిర్ణయాత్మక పాత్ర పోషించారన్నారు. అందుకు కృతజ్ఞత తెలుపుతూ అక్కడి భాజపా నేతలు తనకు ఫోన్‌ చేసినట్లు వెల్లడించారు. ఇది కేవలం అల మాత్రమేనని, నిజమైన సునామీ రాబోతోందని సువేందు అధికారి అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సునామీని చూస్తామన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు బెంగాల్‌, ఒడిశా ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. బెంగాల్‌లో అవినీతి, కుటుంబ తరహా పాలనను తుదముట్టించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)