బస్సులో ప్రయాణించిన వీధి కుక్క !

Telugu Lo Computer
0


బెంగళూరు బస్సులో ఆసక్తకిర సంఘటన చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క బస్సులో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండ కొంతదూరం వరకు జాయ్ రైడ్ చేసిన ఆ కుక్కను చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. వావ్ ఈ కుక్క ఎంత బాగుందో అంటూ జంతు ప్రేమికులు మురిసిపోతున్నారు. కాగా మారతహళ్లి నుంచి ఇందిరానగర్‌కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులోకి అనుకొకుండ ఒక కుక్క ఎక్కింది. మొదట దాన్ని చూసి ఆందోళన పడ్డారు. అయితే అది ఎవరిని ఏం అనకుండ సైలెంట్‌గా బస్సులో కూర్చోవడంతో ప్రయాణికలు కాస్తా ఊరట చెందారు. అంతేకాదు ఆ కుక్క ప్రయాణికుతో స్నేహపూర్వకంగా వ్యవహరించడంతో కొందరు దానితో ఆడుతూ ప్రేమ కురిపించారు. ఇదంత బస్సులో ఉన్న తమ కెమెరాలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందుకే బెంగళూరు అంటే ఇష్టం అంటూ ఓ నెటిజన్ కామెంట్స్ చేయగా.. బెంగళూరు వాసులు జంతు ప్రేమికులని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కొనియాడుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)