ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన మహిళ ఆర్పీఎఫ్ ఉద్యోగిని !

Telugu Lo Computer
0


రైలు ఎక్కే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు ఎంతగా ప్రచారం చేయిస్తున్నా ప్రయాణికులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రైలు కదులుతోన్న సమయంలో దిగడం, ఎక్కడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ రైల్వే పరిధిలోని ఓ రైల్వే స్టేషన్‌లో తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగకముందే ఎక్కే ప్రయత్నం చేసింది ఓ అమ్మాయి. దీంతో ఒక్కసారిగా జారి రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఉండే ఖాళీలో పడబోయింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఆ అమ్మాయిని లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. సమయానికి ఆ ప్రయాణికురాలిని రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది చూశారు కాబట్టి ఆమె గాయాలు కాకుండా బయటపడింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన మహిళ ఆర్పీఎఫ్ ఉద్యోగిని అధికారులు అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)