ప్రాణం తీసిన అక్రమ సంబంధం !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని చెన్నరాయణపట్టకు చెందిన సంజ్ పోలీసు శాఖలో కానీస్టేబుల్. పోలీసుగా ఉద్యోగం చేస్తున్న సంజయ్ కి వివాహం అయ్యింది. పెళ్లి చేసుకుని భార్యతో జీవితం సాగిస్తున్న సంజ్ బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యాడు. ఈ సందర్బంలో త్యాగరాజనగర్ పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డుగా పని చేస్తున్న రాణి అనే మహిళ సంజయ్ కి పరిచయం అయ్యింది. రాణికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో కాపురం చేస్తున్న రాణి కానిస్టేబుల్ సంజయ్ తో చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాణి ఇంటికి వెళ్లిన సమయంలో ఆమెకు ఫోన్ రావడంతో ఎవరు ఫోన్ చేశారు అని సంజయ్ అతని ప్రియురాలు రాణిని ప్రశ్నించాడు. తన స్నేహితుడు ఫోన్ చేశాడని రాణి సంజయ్ కి చెప్పింది. తనకు తెలీకుండా ఎవరు ఫోన్ చేశారు అంటూ సంజయ్ అతని ప్రియురాలితో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు సక్రమమైన సమాచారం ఇవ్వకపోతే నీ మీద పెట్రోల్ పోసి చంపేస్తానని సంజయ్ అతని ప్రియురాలికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సంజయ్, రాణిల మధ్య పెద్ద గొడవ జరిగింది. రాణితో గొడవపడి బయటకు వెళ్లిన సంజయ్ మూడు లీటర్ల పెట్రోల్ క్యాన్ లో తీసుకుని వెళ్లాడు. ఎక్కువ మాట్లాడితే పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేస్తానని సంజయ్ అతని ప్రియురాలు రాణిని హెచ్చరించాడు. అయితే అదే పెట్రోల్ తీసుకుని ప్రియుడు సంజయ్ మీద పోసిన రాణి నిప్పంటించింది. తీవ్రగాయాలైన సంజయ్ ని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సంజయ్ చనిపోయాడి పోలీసులు చెప్పారు. అక్రమ సంబంధం కారణంగా రాణి తన భర్త సంజయ్ ని హత్య చేసిందని పోలీసు భార్య కేసు పెట్టిందరని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)