ఐఐటీ విద్యార్థినిపై లైంగిక దాడి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) క్యాంప్ పరిధిలో ఐఐటీ మహిళా విద్యార్థిపై లైంగిక దాడి కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వారణాసి పోలీసులు ఆదివారం తెలిపారు. అనుమానితులను కునాల్ పాండే, ఆనంద్ అలియాస్ అభిషేక్ చౌహాన్, సాక్షం పటేల్‌గా గుర్తించినట్లు లంక పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి అధికారి శివకాంత్ మిశ్రా తెలిపారు. నవంబర్ ఒకటో తేదీ అర్ధరాత్రి సదరు బాధితురాలిపై అనుమానితులు లైంగిక దాడి చేశారని చెబుతున్నారు. తన స్నేహితుడితో హాస్టల్ నుంచి బయటకు వెళ్లినప్పుడు ముగ్గురు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లారని విద్యార్థిని తన ఫిర్యాదులో తెలిపింది. తన స్నేహితుడిని తప్పించేందుకు తనను చుట్టుముట్టారని ఆమె ఆరోపించింది. బాధితురాలిని వివస్త్రను చేసి ఫోటోలు, వీడియో చిత్రీకరించారని ఆరోపించింది. 15 నిమిషాల తర్వాత తన ఫోన్ నంబర్ తీసుకుని, వదిలి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)