కివీస్‌ను చిత్తు చేసిన బంగ్లా !

Telugu Lo Computer
0


మూడు వన్డేలో సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ లోని నేపియర్ వేదికగా జరిగిన చివరిదైన మూడో టీ20 లో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి న్యూజి లాండ్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. 99 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా, 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ ఆరంభంలోనే రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగినా, అనామల్ హక్, శాంటో భారీ భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ కు విజయాన్ని అందించారు. శాంటో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే హక్ 37 పరుగులు చేసాడు. కివీస్ బౌలర్లలో విలియం రోర్క్ కు ఒక వికెట్ దక్కింది. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ కేవలం 98 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు ఆరంభం నుంచి ఎటాకింగ్ చేస్తూ కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి కివీస్ ను ఒత్తిడిలో పడేసారు. షోరిఫుల్ ఇస్లాం, షకీబ్, సౌమ్య సర్కార్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. ముస్తాఫిజార్ కు ఒక వికెట్ దక్కింది. కివీస్ జట్టులో విల్ యంగ్ 26 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు వన్డేలు న్యూజిలాండ్ గెలిచిన సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)