మరో ముగ్గురు ఎంపీల సస్పెండ్‌ !

Telugu Lo Computer
0


పార్లమెంట్‌ నుంచి మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీలు డీకే సురేష్‌, దీపక్‌ బజి, నకుల్‌నాథ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. సభలో నిరసనకు దిగొద్దంటూ ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా హెచ్చరించారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఉభయసభల్లో సస్పెండ్‌ అయిన విపక్ష ఎంపీల సంఖ్య146కు చేరింది. మరోవైపు తమ ఎంపీల సస్పెన్షన్​పై ప్రతిపక్షాలు నిరసనలను తీవ్రం చేస్తునే ఉన్నాయి. కాగా డిసెంబర్ 13న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో విపక్ష ఎంపీలు పట్టుబట్టిన చేసిన విషయం తెలిసిందే. సభ్యుల నినాదాలతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. నిరసనలతో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుండటంతో డిసెంబర్ 14 నుంచి ఇప్పటి వరకు 146 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)