ప్రపంచంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ !

Telugu Lo Computer
0


రోపా ఖండంలో ఉన్న వాటికన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఈ దేశం వైశాల్యం కేవలం 44 హెక్టార్లు అంటే దాదాపు 108 ఎకరాలు. ఈ దేశంలో నివసించాలనేది ప్రపంచంలో అనేక మంది కల. వాటికన్ సిటీ కంటే ఇటలీ రాజధాని రోమ్‌లో ఉన్న జనాభా 1000 మంది తక్కువ. రోమ్ నగరంలో ఉన్న ఈ దేశ భాష లాటిన్. వాటికన్ సిటీలో కాథలిక్ క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రజల మతపరమైన, సాంస్కృతిక గమ్యస్థానం. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ చర్చి నాయకుడైన పోప్ కు నిలయం. ఇక్కడ వీధుల్లో తిరుగుతూ ఎవరైనా సరే ఒక ప్రత్యేక రకమైన శాంతిని అనుభవించవచ్చు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాను కూడా సందర్శించవచ్చు. దీనిని ఇటాలియన్ భాషలో వాటికన్‌లో బాసిలికా డి శాన్ పియట్రో అని పిలుస్తారు. కాథలిక్ సంప్రదాయం ప్రకారం ఈ పెద్ద చర్చి సెయింట్ పీటర్‌ను ఖననం చేసిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అతను ఏసు 12 మంది శిష్యుల్లో ఒకడు. సెయింట్ పీటర్స్ బసిలికా సముదాయంలో సుమారు 100 సమాధులు ఉన్నాయి. ఈ ప్రదేశం ముఖ్యంగా తీర్థయాత్రగా ప్రసిద్ధి చెందింది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఈ నగరంలో సందర్శనం మంచి జ్ఞాపకాన్ని ఇస్తుంది. వాటికన్ సిటీకి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత కారణంగా క్రిస్మస్ సందర్భంగా ప్రజలు భారీగా చేరుకుంటారు. క్రిస్మస్ పండుగను చూసేందుకు ఇతర దేశాల నుంచి కూడా ఈ నగరానికి వస్తుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)