'జాతి సంరక్షకుడు' అని పిలిచే ప్రధాని మోడీ క్రూరత్వానికి ఇది నిదర్శనం !

Telugu Lo Computer
0


భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా.. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ తన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను ఇటీవల తిరిగి వెనక్కు ఇచ్చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీలపై ఆరోపణలు గుప్పించారు. 'జాతి సంరక్షకుడు' అని పిలిచే ప్రధాని మోడీ క్రూరత్వానికి ఇది నిదర్శనమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''దేశంలోని ప్రతి కూతురికి ఆత్మ గౌరవమే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే పతకం, గౌరవం, మరేదైనా వస్తాయి. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే.. తమని తాము 'బాహుబలి'గా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ అయ్యాయా? దేశానికి సంరక్షకుడైన ప్రధానమంత్రి నుంచి ఇటువంటి క్రూరత్వం, ఉదాసీనత చూస్తుంటే చాలా బాధగా ఉంది'' అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)