తగ్గిన భారత వాణిజ్య లోటు

Telugu Lo Computer
0


భారత్‌ వాణిజ్య లోటు 2023 అక్టోబర్‌లో 31.46 బిలియన్‌ డాలర్ల నుంచి నవంబర్‌లో 20.58 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఎగుమతులు 2.80% తగ్గి 33.90 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే దిగుమతులు 2022 నవంబర్‌లో 55.80 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 54.48 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2022 నవంబర్‌లో భారతదేశ వాణిజ్య లోటు 32 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఏప్రిల్‌ 1న ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో ఎగుమతులు 6.51% తగ్గి 278.8 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు 8.67% తగ్గి 445.15 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)