ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం !

Telugu Lo Computer
0


తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2006లో మిడ్జెల్ జెడ్పీటీసీగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్‌సీగా గెలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లోనూ మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా.. మరసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. 2021లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపికై 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం పదవిని చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)