ఎన్నికల్లో లబ్ధి కోసం చేసిన నాటకీయ ప్రక్రియే పార్లమెంట్‌పై దాడి ?

Telugu Lo Computer
0


పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్ధులు దేశాన్ని ఎలా కాపాడతారని మోడీ ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. శనివారం నాడు ఢిల్లీలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ''భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు. వారు చేసిన తప్పేంటి? పార్లమెంట్‌పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా ? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా? పొరపాటున ఏ ఎంఐఎం  ఎంపీ ఇచ్చి ఉంటే ఏం చేసేవారు? పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్థులు భారతదేశాన్ని ఎలా కాపాడతారు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నా అనుమానం.ఎన్నికల్లో లబ్ధి కోసం చేసిన నాటకీయ ప్రక్రియ అనిపిస్తోంది. లేదంటే ఎంత సీరియస్‌గా వ్యవహరించాలి? అలాంటిదేమీ కనిపించడం లేదే? ఎన్నికల గిమ్మిక్‌లో భాగంగానే ప్రమాదకర గేమ్ ఆడారు. ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుంది కాబట్టి ఇలా చేస్తున్నారు. రామజన్మభూమి ఆలయానికి వ్యూహాత్మకంగా అందరినీ పిలిచారు. బాబ్రీ మసీదు కూలగొట్టడానికి ఆద్యుడు ఎల్ కే అద్వానీ. కానీ ఆయన్ను రానివ్వడం లేదు. ఆయనొస్తే పేరు ఆయనకే వెళ్తుంది. అది మోడీకి ఇష్టం లేదు. ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేశామని గోల చేస్తున్నారు. అది ఒక కళ. ఇండియా కూటమి పొత్తులు తెలంగాణలో విజయం సాధించాయి'' అని నారాయణ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)