తెలంగాణలో జూడాలతో ప్రభుత్వ చర్చలు సఫలం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మంగళవారం ఉదయం జూనియర్ డాక్టర్లు సమావేశమై తమ సమస్యలను వివరించారు. ఈ సమావేశం అనంతరం జూనియర్ డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జరిపిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. పీజీ విద్యార్థులు వస్తున్న కొద్ది రూమ్స్ సరిపోవడం లేదని, కొత్తగా హాస్టల్ భవనాలు నిర్మించాలని కోరడంతో మంత్రి అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనం నిర్మించాలని కోరామని, దానికి రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తామని మంత్రి చెప్పినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)