సేవ, కరుణ ఏసుక్రీస్తు జీవన సందేశం !

Telugu Lo Computer
0


క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ఆ వర్గానికి చెందిన కొంతమంది ప్రతినిధులతో ప్రధాని మోడీ తన నివాసంలో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజంతో తనకున్న అనుబంధాన్ని, గతంలో పోప్‌తో భేటీ అయినప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. పేద, అణగారిన ప్రజలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారని ప్రధాని మోడీ కొనియాడారు. ముఖ్యంగా ఆరోగ్య, విద్యా రంగాల్లో భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడతారన్నారు. సేవ, కరుణ ఏసుక్రీస్తు జీవన సందేశమని.. సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసమే ఆయన పని చేశారన్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి ప్రయాణంలో ఆయన విలువలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. సహకారం, సమన్వయం అనే స్ఫూర్తితో తమ ఉమ్మడి విలువలు, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ప్రజలు దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)