కుస్తీని వదిలేస్తున్నా!

Telugu Lo Computer
0


లైంగికంగా వేధించాడని మహిళా రెజ్లర్లు ఆరోపించిన బ్రిజ్ భూషణ్ అనుచరుడే రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం వారిని కలిచివేస్తోంది. ఈ విషయంపై భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ తాను రెజ్లింగ్ క్రీడను వదిలేస్తున్నట్లు చెప్పారు. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా 40 రోజుల పాటు రోడ్లపై ధర్నా చేపట్టామని, ఆ సమయంలో తమకు దేశవ్యాప్తంగా ప్రజలు అండగా నిలిచారని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఎన్నికల్లో వారు మద్దతిచ్చిన అభ్యర్థి ఓటమి పాలవ్వడం పట్ల ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ బిజినెస్ అనుచరుడు విజయం సాధించారని, అందుకే తాను రెజ్లింగ్ క్రీడను వదిలేస్తున్నట్లు సాక్షి మాలిక్ వెల్లడించారు. మీడియా సమావేశం నుంచి ఆమె కంటతడి పెట్టుకుంటూ బయటకు వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ తమను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)