శ్రీశైలంలో కనిష్ఠ స్థాయికి పడిపోయిన విద్యుదుత్పత్తి

Telugu Lo Computer
0

 


శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి విద్యుదుత్పత్తి పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 9 వరకు 6.054 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అయింది. 1982లో శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం నిర్మించిన తర్వాత 1993-94లో అత్యధికంగా 3797.909 మిలియన్‌ యూనిట్ల గరిష్ఠ విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది 6.054 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తికి పడిపోవడంతో 2023-24 కనిష్ఠ విద్యుదుత్పత్తి జరిగిన సంవత్సరంగా నమోదయ్యే అవకాశముంది. వచ్చే మూడున్నర నెలల కాలంలో విద్యుదుత్పత్తికి ఇక అవకాశం లేకపోవచ్చని విద్యుత్తుశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలోకి చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా జలాశయ నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. విద్యుత్కేంద్రంలో ఉన్న ఏడు యూనిట్‌లూ పూర్తిస్థాయిలో నడిస్తే ఒక్క రోజులో మొత్తం 18.48 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. దానికి 3.5 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం సాగునీటి అవసరాలకే నీరు సరిపోని పరిస్థితి ఉండడంతో విద్యుత్తు ఉత్పాదనను నిలిపేయాల్సి వచ్చింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఎక్కువగా విద్యుదుత్పత్తి చేస్తున్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది.

Post a Comment

0Comments

Post a Comment (0)