ఆంధ్రాహళ్లిలోని ప్రధాన ఉపాధ్యాయురాలు సస్పెండ్ !

Telugu Lo Computer
0


బెంగళూరులోని ఆంధ్రాహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవమ్మను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కర్ణాటకవిద్యాశాఖా మంత్రి మధు బంగారప్ప స్పందించారు. ఆంధ్రహళ్లి పాఠశాలలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు అని విచారం వ్యక్తం చేశారు. పిల్లల చేత మరుగుదొడ్డి శుభ్రం చేయించడం వింటే అసహ్యం వేస్తోందని అన్నారు. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నామని మంత్రి మధు బంగారప్ప అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిదేవమ్మను ఇప్పటికే సస్పెండ్ చేశామని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో అని విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని మంత్రి మధు బంగారప్ప అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మధు బంగారప్ప స్పష్టం చేశారు. 600 మంది పిల్లలున్న ఆంధ్రహళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు శెనగ చిక్కి (శెనగ స్వీట్‌) ఇచ్చి మరుగుదొడ్డి శుభ్రం చేయాలన్నారు. సాధారణంగా పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా భోజనం, పాలు, గుడ్లు అందజేస్తుంది. కానీ టీచర్లు పిల్లతో ఇలాంటి పనులు చేయించడం నిజంగా అసహ్యం. ఇక్కడ మరుగుదొడ్డి ఎవరు శుభ్రం చేస్తారు అంటూ పిల్లలకు పోటీ పెడుతున్న టీచర్లు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారని వెలుగు చూసింది. టీచర్లు భోజనం చేసిన తరువాత వారి ప్లేట్లు కడగమని పిల్లలకు ఉపాధ్యాయులు చెబుతున్నారని వెలుగు చూసింది. ఈ విషయం బయటకు రావడంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)