రైలు నుంచి జారిపడి రైల్వే డ్రైవర్‌ మృతి !

Telugu Lo Computer
0

చైన్నె- ముంబయి సూపర్‌ ఫాస్ట్‌ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి కొండా సుమన్‌ బాబు(33) అనే రైల్వే డ్రైవర్‌ మృతి చెందారు. రైల్వే సిబ్బంది సమాచారం మేరకు తిరుపతిలో నివాసం ఉంటున్న కొండా సుమన్‌ బాబు ఏడేళ్లుగా రైల్వే శాఖలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎర్రగుంట్లలో ఆయన విధులకు హాజరు కావాల్సి ఉండటంతో చైన్నె- ముంబయి సూపర్‌ ఫాస్ట్‌ రైలులో రేణిగుంట నుంచి ఎర్రగుంట్లకు స్లీపర్‌ కోచ్‌లో బయలుదేరారు. ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్‌లో రైలు కాస్త వేగం తగ్గింది. ఇదే సమయంలో ప్రమాదవశాత్తు సుమన్‌బాబు రైలు నుంచి జారి కిందపడ్డారు. ప్లాట్‌ఫాంపై అరక్కోణం ప్యాసింజర్‌ రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు గమనించి వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడికి చేసుకొని గాయపడిన సుమన్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహన్ని రైల్వే అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)