జరిమానాతోపాటు డబ్ల్యూటీసీ పాయింట్లలో టీమిండియాకు భారీ కోత !

Telugu Lo Computer
0


సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఓపెనింగ్ టెస్ట్‌లో రెండు ఓవర్లు తక్కువ బౌలింగ్ చేసినందుకు రోహిత్ శర్మ జట్టు రెండు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను కోల్పోయింది. అలాగే, భారత జట్టు మ్యాచ్ ఫీజులో 10% జరిమానా కూడా విధించింది. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలకు చెందిన క్రిస్ బ్రాడ్, భారత్ లక్ష్యానికి రెండు ఓవర్లు తక్కువగా ఉండటంతో ఈ శిక్షను విధించాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం టీమ్ ఇండియాకు ఈ జరిమానా విధించారు. ఇది కనీస ఓవర్ రేట్‌కి సంబంధించినది. ఇందులో, ఆటగాళ్లు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 5% జరిమానా విధిస్తారు. స్లో ఓవర్ రేట్‌కు పాయింట్లు తగ్గించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా స్థానం బలహీనంగా మారింది. దక్షిణాఫ్రికాపై ఓటమి తర్వాత టీమిండియా 16 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. అయితే, పాయింట్లు తగ్గడంతో 14 పాయింట్లతో ఆ జట్టు ఆరో స్థానానికి పడిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)