సాయం కోరిన హీరో విష్ణు విశాల్ !

Telugu Lo Computer
0


మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో చెన్నై నగరం నీటి ముంపునకు గురై జనజీవనం స్తంభించింది. అయితే తుపాన్‌ దెబ్బకు చెన్నైతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ నటుడు విష్ణు విశాల్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తాను వరదల్లో చిక్కుకున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కారప్పాకంలోని తమ ఇంట్లోకి నీరు చేరిందని.. సాయం కోసం వేచి కాల్ చేశానని తెలిపారు. విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఇంటి పైకప్పు పైకి రావడంతో సిగ్నల్ దొరకడంతో పోస్ట్ చేశానన్నారు. నాతో ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు ట్వీట్‌లో ప్రస్తావించారు. విష్ణు విశాల్ ప్రస్తుతం రజినీకాంత్ లాల్ సలాం, ధనుశ్ డీ50 చిత్రాల్లో నటిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)