కార్గిల్ యుద్ధాన్ని వద్దన్నందుకే నన్ను తొలగించారు !

Telugu Lo Computer
0


భారతదేశంతో సత్సంబంధాల ప్రాముఖ్యతను చెప్పినందుకు, కార్గిల్ ప్లాన్ వ్యతిరేకించినందుకు అప్పటి జనరల్ పర్వేజ్ ముషారప్ 1999లో తన ప్రభుత్వాన్ని దించేశారని పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధినేత నవాజ్ షరీఫ్ శనివారం అన్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన తనను ముందస్తుగా ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. ''నేను 1993, 1999లో ఎందుకు ప్రధాని పదవి నుంచి తొలగించబడ్డానో చెప్పాలి. నేను కార్గిల్ ప్లాన్‌ని వ్యతిరేకించినప్పుడు, నన్ను పదవీ నుంచి దింపేశాడు. ఆ తర్వాత నేను చెప్పింది నిజమే అని తేలింది.'' అని షరీఫ్ అన్నారు. వచ్చే ఫిబ్రవరిలో పాక్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)