టీచర్ ని కిడ్నాప్ చేసి కూతురితో బలవంతంగా పెళ్లి చేసిన కిడ్నాపర్ !

Telugu Lo Computer
0

బీహార్ లో గౌతమ్ కుమార్ అనే టీచర్ ని కిడ్నాప్ చేసి, కిడ్నాపర్ తన కుమార్తెకి ఇచ్చి బలవంతంగా పెళ్లి జరిపించాడు. ఇప్పుడు ఇది రాష్ట్రంలో హాట్ టాపిగ్‌గా మారింది. గౌతమ్ కుమార్ ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, టీచర్ ఉద్యోగం పొందాడు. బుధవారం పాఠశాలకు వచ్చిన నలుగురు వ్యక్తులు గౌతమ్ కుమార్‌ని కిడ్నాప్ చేసి అందులో ఒక కిడ్నాపర్ కుమార్తెతో వివాహం జరిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార బీహార్ వైశాలి జిల్లా పతేపూర్‌లోని రేపురాలో గౌతమ్ కుమార్‌కి  ఉత్క్రమిత్ మధ్య విద్యాలయంలో జాబ్ వచ్చింది. అక్కడి నుంచి అతడిని కిడ్నాప్ చేశారు. ఫిర్యాదు అందడంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు. అంతకుముందు కుమార్ కోసం అతని కుటుంబం బుధవారం రాత్రి రోడ్డును దిగ్భంధించి నిరసన తెలిపింది. గౌతమ్ కుమార్ కుటుంబం రాజేష్ రాయ్ అనే వ్యక్తే కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేశారు. ఇతనే గౌతమ్‌ని బలవంతంగా ఎత్తుకెళ్లి తన కుమార్తె చాందినితో వివాహం చేశారని ఆరోపించారు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించని గౌతమ్‌ని శారీరకంగా హింసించారు. అయితే ఇటీవల పాట్నా హైకోర్టు, నవడాలోని ఆర్మీ వ్యక్తిని, లఖిసరాయ్‌ల మధ్య జరిగిన బలవంతపు పెళ్లిని రద్దు చేసిన విషయాన్ని గౌతమ్ కుమార్ చెప్పాడని తెలిపారు. కిడ్నాపర్లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)