రాజ్యసభ చైర్మన్‌కు ఎన్డీఎ ఎంపీల సంఘీభావం !

Telugu Lo Computer
0

పరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ను హేళన చేస్తూ టీఎంసీ ఎంపీ చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. చైర్మన్‌ ధన్‌కడ్‌ ఈ చర్యను ఖండించగా,  ప్రధాని మోడీ ఈ ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్‌ చేసి సంఘీభావం తెలిపారు. అలాగే తెలంగాణ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సైతం ఈ చర్యను తప్పు పట్టారు. ఉప రాష్ట్రపతికి ఫోన్ చేసి వివరాలు సేకరించి ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం పెద్దల సభలో ఎన్డీయే ఎంపీలు, ధన్‌కడ్‌కు సంఘీభావం ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో గంటపాటు ఎన్డీఎకు చెందిన ఎంపిలు నిలబడి రాజ్యసభ చైర్మన్ ధన్ కడ్ కు మద్దతు తెలిపారు… ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాజ్యసభలో మాట్లాడుతూ, ”ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని అవమానించారు. జాట్‌ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి మీరు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు అవమానించారు. మీరు ఉన్న ఉన్నతస్థానం పట్ల వాళ్లకు గౌరవం లేదు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం మేం సహించలేం అని తెలిపారు. వాళ్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ. మీకు గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)