లైంగిక దాడి చేసిన వ్యక్తిని చంపిన బాలురు !

Telugu Lo Computer
0


ఢిల్లీలో లైంగిక వేధింపులకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ మైనర్ బాలుడు, అతని ఇద్దరు స్నేహితులు కలిసి ఓ 25 ఏళ్ల యువకుడిని పొడిచి, దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఎలాంటి ఆనవాళ్లు, ఆధారాలు దొరక్కుండా అతని డెడ్ బాడీని కాల్చేశారు. ఢిల్లీలో కలకలం సృష్టించిన ఈ ఘటన డిసెంబర్ 21వ తేదీన రాత్రి నిజాముద్దీన్‌లో జరిగింది. నిజాముద్దీన్ బస్తీ నివాసితులైన నిందితులు బాధితుడి ముఖాన్ని రాళ్లతో చితగ్గొట్టి, సాక్ష్యాలు దొరక్కుండా అతని శరీరానికి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. మైనర్‌లలో ఇద్దరికి 16 ఏళ్లు, ఒకరికి 17 ఏళ్లు. ఘటన అనంతరం యువకులను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి, ఆ తర్వాత షెల్టర్ హోమ్‌కు పంపినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  డిసెంబర్ 23న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తాము ఆజాద్ అనే వ్యక్తిని హత్య చేశామని, అతని మృతదేహం ఖుస్రో పార్క్‌లో పడి ఉందని ముగ్గురూ వెల్లడించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ) రాజేష్ డియో తెలిపారు. సగం కాలిపోయిన మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి తమ బృందాన్ని పంపించామన్న ఆయన.. క్రైమ్ అండ్ ఫోరెన్సిక్స్ బృందం నేర స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ఎయిమ్స్‌కు పంపారని చెప్పారు. ఆజాద్ అనేక సందర్భాల్లో ఆ ముగ్గురిలో ఒకరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మైనర్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ముగ్గురూ కలిసి ఆజాద్ పై దారుణంగా దాడి చేసి హత్య చేశామన్నారు. చనిపోయిన అతనికి సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలు లభించకుండా పొడి గడ్డి, బట్టల సహాయంతో మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో రానికి ఉపయోగించిన చెక్కతో చేసిన ఓ ఆయుధం, రాళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)