తెలంగాణలో పోలీస్ నియామకాలు !

Telugu Lo Computer
0


తెలంగాణలో పోలీస్ నియామకాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ 10 ఏళ్లలో జరిగిన ఉద్యోగ నియామకాలపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై శుక్రవారం సెక్రటేరియట్‌లో సమీక్ష జరిపారు. పోలీస్ నియామకాల కోసం నిరుద్యోగులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ నియామకాలు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. అంతేకాదు  ఈ నియామకాలను పారదర్శకంగా, అవినీతి రహితంగా చెయ్యాలని కోరారు. నియామకాలు చేపట్టేందుకు ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని తనకు రిపోర్ట్ రూపంలో ఇవ్వాలని చెప్పారు. తెలంగాణలో 8 ఏళ్లుగా హోమ్ గార్డుల నియామకాలు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖలో హోమ్ గార్డుల నియామకాలను చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్‌ని సరిచేసేందుకు హోమ్ గార్డుల సేవల్ని మరింతగా ఉపయోగించుకోవాలి సూచించారు. హోమ్ గార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


Post a Comment

0Comments

Post a Comment (0)