కేటీఆర్ కామెంట్స్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్ !

Telugu Lo Computer
0


ర్ణాటక అసెంబ్లీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడిన వీడియో అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ఓట్ల కోసం అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. కానీ అయితే డబ్బులు లేవు' అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా ఉన్న వీడియో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ షేర్ చేస్తూ సటైర్లు విసిరారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇంతేనా? అంటూ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కామెంట్స్‌పై తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. కేటీఆర్ షేర్ చేసిన వీడియోను ఆయన కొట్టిపారేశారు. 'కేటీఆర్.. తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? ఎందుకంటే ఏది ఫేక్ వీడియోనో, ఏది ఒరిజినల్ వీడియోనో కూడా మీరు తేల్చుకోలేకపోతున్నారు. ఫేక్ వీడియోలను బీజేపీ సృష్టిస్తుంటే  వాటిని మీరు ప్రచారంలోకి తెస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి నిజమైన బీ టీంగా వ్యవహరిస్తోందని మరోసారి రుజువు చేశారుజ' అంటూ సిద్దరామయ్య కేటీఆర్‌కు రీకౌంటర్ ఇచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)